వైభవంగా అనంత పద్మనాభస్వామి వ్రతం

ABN , First Publish Date - 2023-09-29T00:54:28+05:30 IST

మండలంలోని నీరుకుళ్ల రంగనాయకుల స్వామివారి ఆలయంలో గురువారం వైభవంగా ఆనంత పద్మనాభ స్వామి వారి వ్రతాలు జరిగాయి.

వైభవంగా అనంత పద్మనాభస్వామి వ్రతం
అనంత పద్మనాభ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 28: మండలంలోని నీరుకుళ్ల రంగనాయకుల స్వామివారి ఆలయంలో గురువారం వైభవంగా ఆనంత పద్మనాభ స్వామి వారి వ్రతాలు జరిగాయి. మానేరు చెంతన కోటి వత్తులతో దీపోత్సవాలు కూడా నిర్వహించారు. నీరుకుళ్ల దేవాలయంలో ఇరవై ఏళ్ల నుంచి ప్రతీ ఏటా బాధ్రపద మాసం శుక్ల పక్షంలోని చతుర్ధశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతాలను భక్తులు ఆచరిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, రాజ్‌కుమారాచా ర్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-29T00:54:28+05:30 IST