మామిడి మార్కెట్ ఆదాయానికి గండి
ABN , First Publish Date - 2023-04-18T23:57:31+05:30 IST
జగిత్యాల మామిడి మార్కెట్‌లో వ్యాపారులు మాయాజాలం కొనసాగుతోంది. అధికారులతో కుమ్మక్కై వ్యవ సాయ మార్కెట్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
- వ్యాపారులతో కుమ్మక్కు అవుతున్న మార్కెట్ అధికారులు
- ప్రతీయేటా సాగుతున్న అక్రమ బాగోతం
- జగిత్యాల మామిడి మార్కెట్‌లో వ్యాపారుల గోల్‌మాల్
జగిత్యాల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మామిడి మార్కెట్‌లో వ్యాపారులు మాయాజాలం కొనసాగుతోంది. అధికారులతో కుమ్మక్కై వ్యవ సాయ మార్కెట్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. వ్యాపారుల గోల్‌మాల్ వల్ల మామిడి సీజన్‌లో మార్కెట్ దాదాపుగా రూ. కోటిన్నరకు పైగా నష్టపోతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మామిడి మార్కెట్‌లకు ప్రసిద్ధి గాంచిన ప్రాంతాల సరసన జగిత్యాల నిలుస్తోంది. ప్రతీ యేటా సుమారు రూ. రెండు వందల కోట్లకు పైగా వ్యాపారం జరు గుతుందన్న అంచనాలున్నాయి. కొన్నేళ్లుగా మార్కెట్ కమిటీకి దాదాపుగా రూ. అరకోటి ఆదాయం మాత్రమే లభిస్తోంది. నిబంధనల ప్రకారం వ్యా పారులు నిర్వహించిన కొనుగోళ్లలో మార్కెట్ కమిటీకి ఒక్క శాతం ఫీజు రూపేనా చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో రూ. కోట్లలో వ్యాపారం నిర్వ హిస్తున్నప్పటికీ మార్కెట్ ఫీజు మాత్రం అంతంతమాత్రంగానే చెల్లిస్తున్నా రు. దీంతో మార్కెట్‌కు తగిన ఆదాయం రావడం లేదు. గత 17 సంవత్స రాల క్రితం ఏర్పాటయిన జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌కు యేటా రూ. 50 నుంచి రూ. 60 లక్షల లోపు మాత్రమే ఆదాయం వస్తోంది.
మామిడి మార్కెట్ పరిస్థితి ఇలా..
జగిత్యాల శివారులోని చల్‌గల్ మామిడి మార్కెట్‌లో వ్యాపారులు ప్రతి సీజన్‌లో సుమారు రూ. 200 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. ప్రతి యేటా సుమారు 5 వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుం టారు. మామిడి కాయలను ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, చంఢీఘడ్, హర్యానా, పంజాబ్, నాగ్‌పూర్ వంటి రాష్ట్రాలకు లారీల్లో, కిసాన్ రైలులో తరలిస్తుం టారు. ప్రతి నిత్యం 20 నుంచి 30 లారీల్లో మామిడి కాయలు వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. పెద్ద లారీల్లో సుమారు 12 నుంచి 15 టన్నుల మామిడి కాయలను తరలిస్తుంటారు. గత నాలుగు, అయిదేళ్లుగా సగటున టన్నుకు రూ. 30 వేల వరకు ధర పలికింది. టన్నుకు రూ. 30 వేల చొప్పున 15 టన్నులకు రూ. 4.50 లక్షలు అవుతోంది. వ్యాపారులు మార్కె ట్‌కు ఒక్క శాతం పీజును చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో లారీకి రూ. 4,500 ఫీజు చెల్లించాలి. ప్రతి రోజు 30 లారీల్లో మామిడి కాయలు తరలితే సుమారు రూ. 1.62 లక్షలు ఫీజు రూపేణా మార్కెట్‌కు ఆదాయం రావాల్సి ఉంది. దాదాపుగా నాలుగు నెలల పాటు మామిడి మార్కెట్ కొన సాగుతోంది. ఈ లెక్కన రూ. కోటిన్నరకు పైగా మార్కెట్‌కు ఆదాయం వ చ్చే అవకాశం ఉంది. మామిడి కాయ ధర పెరిగిన సందర్భంలో దాని ప్ర కారం ఫీజు కట్టాల్సి ఉంటుంది. వ్యాపారులు అధిక రేటుకు మామిడి కా యలు కొనుగోలు చేసినప్పటికీ తక్కువ రేటుకు కొనుగోలు చేశామని గోల్‌మాల్ చేస్తూ ఆ మేరకు మాత్రమే అధికారులకు మార్కెట్ ఫీజు చె ల్లిస్తున్నారు. అధికారులకు పరిస్థితి తెలిసినప్పటికీ పట్టించుకోక పోవడంతో మార్కెట్ ఆదాయం కోల్పోతున్నది.
వ్యాపారం రూ. కోట్లకు పైగా..ఆదాయం రూ. లక్షల్లో..
జగిత్యాల మామిడి మార్కెట్‌కు 2022-23 సీజన్‌లో గత యేడాది రూ. 59.48 లక్షలు ఫీజు వసూలు అయింది. అదేవిదంగా 2021-22 సంవత్స రంలో రూ. 91.70 లక్షలు, 2020-21 సంవత్సరంలో 69.65 లక్షలు, 2019-20 సంవత్సరంలో రూ. 64.01 లక్షలు, 2018-19 సంవత్సరంలో రూ. 71.89 లక్షలు మాత్రమే మార్కెట్ ఫీజు వసూలు అయినట్లు రికార్డులు తె లుపుతున్నాయి. మార్కెట్ లైసెన్స్ తీసుకోవడానికి, నిర్ణీత ఫీజు చెల్లించ డానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తిచూపడం లేదు. ఇదే సమయంలో అధి కారులు సైతం పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ఫీజులు చె ల్లిస్తే మార్కెట్‌కు తగిన ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. మార్కె ట్ యార్డులకు రైతులు తీసుకొని వచ్చిన పంట ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల చేపట్టే లావాదేవీల ఆదారంగా మార్కెట్ యార్డుకు సెస్ చెల్లిస్తారు. మార్కెట్ ఫీజు చెల్లింపు ప్రధాన ఆదాయ వన రుగా ఉంటోంది. ఇటీవల యార్డులో ప్రారంభించిన షెడ్లలోనే మామిడి కా యల కొనుగోళ్లు జరపాలని, యార్డు వెలుపల క్రయ విక్రయాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రధాన గేటు వద్ద అధికారులు ఫ్లెక్సీ ప్రదర్శన జరుపుతున్నారు. అయినప్పటికీ వ్యాపారులు పట్టించు కో కుండా యార్డు వెలుపలనే కొనుగోళ్లు ప్రారంభించారు. మార్కెట్ ఫీజు ఎగ వేయడానికే వ్యాపారులు ఎత్తులు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికా రులు పకడ్భందీ చర్యలు తీసుకొని ఆదాయానికి గండి పడకుండా చూడా ల్సిన అవసరముందని రైతులు కోరుతున్నారు.
పకడ్బందీ చర్యలు తీసుకుంటాం
- ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి
జగిత్యాలలోని మామిడి మార్కెట్‌లో వ్యాపారులు మార్కెట్ ఫీజు చెల్లిం చేలా పకడ్భందీ చర్యలు తీసుకుంటాము. మార్కెట్ ఆదాయానికి గండి కొట్టే వ్యాపారులను గుర్తిస్తాము. ఎప్పటికప్పుడు క్రయ విక్రయాలపై పర్య వేక్షణ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటాము.