శ్రీవారి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కండి

ABN , First Publish Date - 2023-05-30T00:22:11+05:30 IST

‘ఆలయ నిర్మాణంలో పాలుపంచుకునే అదృష్టం మన కరీంనగర్‌ ప్రజలకు వచ్చింది... ఈనెల 31న కరీంనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ నిర్వహిస్తున్నాం.. ఇంత చక్కటి దైవిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించాలి’ అని మంత్రి గంగుల కమలాకర్‌ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  శ్రీవారి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కండి
టీటీడీ భూమిపూజ, శ్రీనివాస కల్యాణోత్సవానికి తరలిరావాలంటూ బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 29: ‘ఆలయ నిర్మాణంలో పాలుపంచుకునే అదృష్టం మన కరీంనగర్‌ ప్రజలకు వచ్చింది... ఈనెల 31న కరీంనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ నిర్వహిస్తున్నాం.. ఇంత చక్కటి దైవిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించాలి’ అని మంత్రి గంగుల కమలాకర్‌ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం 46వ డివిజన్‌ శాస్త్రీరోడ్‌, టవర్‌సర్కిల్‌ ప్రాంతంలో మంత్రి గంగుల కమలాకర్‌ శ్రీవారి ఆలయ భూమిపూజ, సాయంత్రం జరిగే శోభాయాత్ర, శ్రీనివాసుడి కల్యాణోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతూ బొట్టుపెట్టి ఆహ్వానించారు. 31న ఉదయం 7 గంటల నుంచి భూమి పూజ, సాయంత్రం 4 గంటలకు మంకమ్మతోట వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శోభాయాత్ర, ఆ తర్వాత శ్రీనివాసుడి కల్యాణోత్సవం జరుగుతుందని చెప్పారు. తిరుమల తరహాలోనే కరీంనగర్‌ శ్రీవారి ఆలయంలోనూ నిత్య పూజలు, ఇతరత్రా సేవలుంటాయని, ఏడాదిన్నరలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, ఇది మన కరీంనగర్‌ ప్రజల అదృష్టమని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ భగవత్‌కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి గంగుల కమలాకర్‌ పేరుపేరున విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు వంగల శ్రీదేవి పవన్‌కుమార్‌, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, కోల మాలతి, నాంపల్లి శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్లు తాటి ప్రభావతి, ఒంటెల సత్యనారాయణరెడ్డి, ప్రేమ్‌కుమార్‌ ముందడా, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్‌, నేతి రవివర్మ, పూసాల శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-30T00:22:11+05:30 IST