Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందా?.. కేసీఆర్ చెప్పాలి: సంజయ్
ABN, First Publish Date - 2023-03-06T20:24:45+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందా? లేదా? సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పాలని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందా? లేదా? సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పాలని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. కవితను కాపాడేందుకే కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత నేతల సంతకాలు లేకుండా ప్రధానికి కేసీఆర్ దొంగ లేఖ రాశారని విమర్శించారు. ఆప్ నేత సిసోడియా (Sisodia)పై సొంత పార్టీ నేతలకే లేని ప్రేమ కేసీఆర్‌కు ఎందుకో? అని ప్రశ్నించారు. స్కామ్ నుంచి బయటపడటానికే అవినీతిపరుల ముఠా ఏకమైందన్నారు. అవినీతిపరులను మోదీ సర్కార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంజయ్ స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్‌తో కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలోనే 28 సార్లు కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు, పెర్నార్డ్ రికార్డ్‌కు చెందిన బినయ్ బాబు పలుమార్లు ఆప్ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్, రిటైల్ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్(సిండికేట్)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది. కవిత, మాగుంట రాఘవ, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. అరుణ్‌పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబులు సౌత్‌గ్రూప్ తరఫున ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది. ఈ కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేసింది. సోమవారం బుచ్చిబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Updated Date - 2023-03-06T20:24:45+05:30 IST