Sharmila: కేసుల కథ అడ్డం తిరగడంతో బీజేపీతో జతకట్టాడంటూ కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-06T18:31:44+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.
''కేసీఆర్, బీజేపీ ఒక్కటికాదని చిన్నదొర నొక్కినొక్కి చెబుతుంటే.. చిన్న పిల్లవాడు కూడా నమ్మడం లేదు పాపం. తెలంగాణలో లేని బీజేపీని పైకిలేపి, ఇన్నాళ్లు విమర్శలు గుప్పించిన కేసీఆర్. కొడుకు, కూతురు కేసులతో కథ అడ్డం తిరిగే సరికి బీజేపీతో జతకట్టాడు. కేసుల నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద మోకరిల్లాడు. ఒక్కసారిగా కేసీఆర్ నాలుక బీజేపీ నుంచి ఇంకో పార్టీకి మళ్లింది. తొమ్మిదేండ్లుగా విభజన హామీలపై మోడీని నిలదీయలేని బీఆర్ఎస్.. బీజేపీకి ‘బీ’ టీం కాదా?. రాష్ట్రానికి వచ్చే నిధుల వాటా గురించి మాట్లాడలేని కేసీఆర్.. మోడీ తొత్తు కాదా?. కాళేశ్వరంలో కేసీఆర్ రూ. వేల కోట్లు తినేసినా కనీసం విచారణ చేయించని బీజేపీ.. బీఆర్ఎస్‌కు మద్దతు తెలిపినట్లు కాదా?. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు అడ్డంగా దొరికినా బేడీలు వేయని బీజేపీ.. బీఆర్ఎస్‌ను కాపాడుతున్నట్లు కాదా?. బీఆర్ఎస్ అంటే "బీజేపీకి రహస్య సమితి". బీఆర్ఎస్ అంటే బరాబర్ బీజేపీకి ‘బీ’టీం. బీజేపీతో కేసీఆర్ చేస్తున్నది సమరం కాదు.. వ్యభిచారం.'' అని షర్మిల మండిపడ్డారు.