Kishan Reddy: రాజశేఖర రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప.. కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..?
ABN , First Publish Date - 2023-07-21T18:10:32+05:30 IST
రానున్న వంద రోజులు బీజేపీకి (BJP) కీలకమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.
హైదరాబాద్: రానున్న వంద రోజులు బీజేపీకి (BJP) కీలకమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం ధర్నాలు చేస్తామని తెలిపారు. ఈ నెల 25న డబుల్ లబ్ధిదారులతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కొత్త పెన్షన్ దారుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని, కొత్త రేషన్ కార్డుల కోసం బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగుతోందన్నారు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులే. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు గజ్వేల్లో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ఇలాకాలో కిషన్ రెడ్డి తొలిసారి పర్యటిస్తున్నారు. జైలుకు వెళ్ళొచ్చిన బీజేపీ కార్యకర్తలను కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు.