మంద కృష్ణను కలిసిన మంత్రి
ABN , First Publish Date - 2023-09-05T23:54:58+05:30 IST
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మంత్రికి స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఖమ్మం నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తనను సీఎం కేసీఆర్ ఖరారు చేశారని, తనను ఆశీర్వదించాలని పువ్వాడ, కృష్ణమాదిగను
ఖమ్మంకార్పొరేషన, సెప్టెంబరు 5: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మంత్రికి స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఖమ్మం నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తనను సీఎం కేసీఆర్ ఖరారు చేశారని, తనను ఆశీర్వదించాలని పువ్వాడ, కృష్ణమాదిగను కోరారు. అలాగే హోంశాఖ మంత్రి మహమూద్‌అలీని కూడా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిసి.. తాను భారీమెజారిటీతో గెలిచే విధంగా ఆశీస్సులందించాలని కోరారు.