TS NEWS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ చోరీ
ABN, First Publish Date - 2023-08-22T23:24:57+05:30
జిల్లాలో నకిలీ మావోయిస్టుల(Fake Maoists) హల్చల్ చేశారు. జూలూరుపాడు మండలం నర్సాపురంలో దోపిడీ(Robbery in Narsapuram) చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem): జిల్లాలో నకిలీ మావోయిస్టుల(Fake Maoists) హల్చల్ చేశారు. జూలూరుపాడు మండలం నర్సాపురంలో దోపిడీ(Robbery in Narsapuram) చేశారు. చెరుకుమల్ల రుక్కయ్య అనే వ్యాపారి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో నలుగురు దోపిడీ దారులు బెదిరించి నగదు ఎత్తుకెళ్లారు.మొదట ఇంట్లోకి వచ్చి నకిలీ పురుగుమందులు అమ్ముతున్నారని వ్యాపారిని దుండగులు బెదిరించారు.భార్య భర్తలకు కత్తులు చూపించి అరిస్తే చంపుతామని బెదిరింపులకు గురిచేశారు. భార్య భర్తలను వేర్వేరు రూమ్లల్లో ఉంచి వారి చేత బీరువాలు తెరిపించి సుమారు 30 తులాల బంగారం చోరీ చేశారు. అరిస్తే చంపుతామని బెదిరించి బయటకు వెళ్లి కారులో దోపిడీ దారులు పారిపోయారు. గతంలో కూడా నకిలీ మావోయిస్టులు తుపాకులు చూపించి నగదు తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2023-08-22T23:25:09+05:30 IST