ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Godavari: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం

ABN, First Publish Date - 2023-07-30T08:20:36+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 56.10 అడుగులకు చేరింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గోదావరి (Godavari) మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక (Third Hazard Warning) కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 56.10 అడుగులకు చేరి.. 15,96,899 క్యూ సెక్కులకు చేరుకుంది. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలం రాయన్న పేట వద్ద.. నేషనల్ హైవే పై వరద నీరు పోటెత్తింది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా ఛత్తీస్ గడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ములుగులో కూడా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

ఇక ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.54 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఇక్కడ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సహాయక చర్యల్లో నాలుగు ఎన్‌డీఆర్ఎఫ్, 4 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ అధికారులు సూచించారు.

Updated Date - 2023-07-30T08:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising