ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధికుక్కలను చంపుతున్నారు!

ABN, First Publish Date - 2023-03-17T00:14:50+05:30

వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ.. చిన్నా పెద్దా తేడా లేకుండా మనుషులపై దాడి చేస్తున్నాయి. మూగజీవాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. ఈ క్రమంలో శునకాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ పలు చర్యలు చేపట్టింది.

దానవాయిగూడెం డంపింగ్‌యార్డును పరిశీలిస్తున్న జంతుసంరక్షణ సమితి బాధ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ట్రాక్టర్‌ట్రక్కులో డంపింగ్‌యార్డుకు తరలిస్తున్న వీధికుక్కల కళేబరాలు

కళేబరాలను దానవాయిగూడెం డంప్‌యార్డులో పడేస్తున్న వైనం

ఖమ్మం నగరపాలకసంస్థ సిబ్బందిపై అనుమానాలు

కొందరు కార్పొరేటర్ల ఆదేశాలతోనే హతమారుస్తున్నారని ప్రచారం

సంతానోత్పత్తి నియంత్రణను మరిచి చంపడంపై జంతుప్రేమికుల ఆక్షేపణలు

ఖమ్మంకార్పొరేషన, మార్చి 16: వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ.. చిన్నా పెద్దా తేడా లేకుండా మనుషులపై దాడి చేస్తున్నాయి. మూగజీవాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. ఈ క్రమంలో శునకాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వీధికుక్కలను వేటాడి చంపుతున్నారని, ఆ కళాబరాలను దానవాయిగూడెం డంపింగ్‌యార్డులో పడేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం దానవాయిగూడెం యార్డులో కుక్కల కళేబరాలను కనిపించిన విషయం వెలుగులోకి రావడంతో పాటు.. ప్రకా్‌షనగర్‌ మున్నేరు ఒడ్డున కూడా పూడ్చి పెడుతున్నారని తెలియడంతో నగరపాలక సంస్థ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీధికుక్కలను స్థానికులు చంపుతున్నారా? లేదంటే నగరపాలకసంస్థ పారిశుధ్య విభాగం, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హతమారుస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే తమకేం తెలీదని, వీఽధుల్లో పడి ఉన్న కుక్కల కళేబరాలను చెత్తతో పాటు వాహనాల్లో తీసుకొచ్చి డంప్‌యార్డులో పడేస్తున్నామని పారిశుధ్య సిబ్బంది చెబుతున్నారు.

కార్పొరేటర్లు చెప్పడంతోనే చంపారా?

డివిజన్ల ప్రజలు చేస్తున్న ఫిర్యాదులతో కొందరు కార్పొరేటర్లు శునకాల నియంత్రణ చర్యలు చేపట్టే క్రమంలో వాటిని హతమార్చాలని చెప్పారని, వారి చెప్పినట్టుగానే పారిశుధ్య సిబ్బంది కుక్కలను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చినట్లు తెలిసింది. గురువారం ఒక్కరోజే 50కిపైగా కుక్కల కళేబరాలను దానవాయిగూడెంలోని డంపింగ్‌యార్డుకు ట్రాక్టర్‌లో తరలించినట్లు జంతు సంరక్షణ సమితి ప్రతినిధులు చెబుతున్నారు. కుక్కలను చంపవద్దని కోర్టులు ఆదేశించిన నేపథ్యంలో భారీసంఖ్యలో కుక్కలను హతమార్చడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే తాము కుక్కలను హతమార్చలేదని, వీధుల్లో పడిఉన్న కుక్కల కళేబరాలను డంపింగ్‌యార్డుకు తరలించామని నగరపాలకసంస్థ సిబ్బంది చెబుతున్నారు.

ఆక్షేపిస్తున్న జంతు సంరక్షణ సమితి సభ్యులు

గతంలో నగరంలోని వీధికుక్కలను నియంత్రణకు చేపట్టిన చర్యల్లో భాగంగా కార్పొరేషన్‌ అధికారులకు వాటి సంతాన ఉత్పత్తిని తగ్గించేలా శస్త్రచికిత్సలు చేయించారు. ఆ తర్వాత వాటికి యాంటీరేబిస్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో పశుసంవర్థకశాఖ అధికారుల సహకారంతో మళ్లీ సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలోనే కుక్కలను హతమార్చి, ట్రాక్టర్లలో తరలించి, డంపింగ్‌యార్డులో పడవేశారన్న విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో కొందరు జంతుసంరక్షణ సమితి ప్రతినిధులు డంపింగ్‌యార్డుకు వెళ్లి పరిశీలించే సరికి కళేబరాలను పూడ్చివేసేందుకు నగరపాలకసంస్థ సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో జంతు సంరక్షణ సమితి సభ్యులు.. కుక్కల కళేబరాలతో నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈలోపే పారిశుధ్య సిబ్బంది వాటిని పూడ్చటం, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో జంతుసంరక్షణ సమితి సభ్యులు ధర్నా కార్యక్రమాన్ని విరమించుకొని. కుక్కలను హతమార్చిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుక్కలను పారిశుధ్య సిబ్బంది హతమార్చలేదు

శ్రీనివాస్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్విరానమెంట్‌ ఏఈ

వీధికుక్కలను పారిశుధ్య సిబ్బంది హతమార్చలేదు. వీధుల్లో పడి ఉన్న కుక్కల కళేబరాలను చెత్తసేకరించే తరలించే క్రమంలోనే ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలించారు. అయితే పారిశుధ్య సిబ్బంది కుక్కల కళేబరాలను తీసుకువెళుతుంటే.. వారే చంపారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-03-17T00:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising