ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు.. ఊరూర విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం

ABN, First Publish Date - 2023-09-15T19:57:13+05:30

పరకాల సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై (Kcr Govt) ఆగ్రహం వ్యక్తం చేశారు.

హనుమకొండ: పరకాల సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై (Kcr Govt) ఆగ్రహం వ్యక్తం చేశారు.


"నేను పర్మిషన్ తీసుకుని ఉపవాస దీక్ష చేస్తే పోలీసులు భగ్నం చేశారు. అందువల్లే నాగొంతు ఇబ్బందిగా ఉంది. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు, రజాకార్ల పీడ విరగడైన రోజు. తెలంగాణలో బురుజులు కట్టుకుని మాన, ప్రాణాలను కాపాడుకున్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన రోజును బయటకు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా చేసిన ఈపాపం కాంగ్రెస్ దే. సోనియాగాంధీకి సెప్టెంబర్ 17న మీటింగ్ పెట్టే అర్హత లేదు. సెప్టెంబర్ 17 చరిత్రను దేశానికి తెలియనివ్వలేదని, కాంగ్రెస్ పార్టీ నేతలు చార్మినార్ దగ్గర ముక్కు నేలకు రాచాకే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టాలి. నాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయ్..?. మజ్లిస్ పార్టీ ఆత్మ కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ కుటుంబంలో చేరింది. అందుకే విమోచన దినోత్సవం జరపడం లేదు. సెప్టెంబర్ 17 సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుంది కేసీఆర్..?. సమైక్యతా దినం అనేవాళ్లు మూర్ఖులు, చరిత్ర హీనులు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసమే సమైక్యదినం అంటున్నారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 17పై పరకాల అమరదామం దగ్గర చర్చకు కేసీఆర్ సిద్ధమా...?. వచ్చే సెప్టెంబర్ 17న తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఊరూర విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం." అని కిషన్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-09-15T19:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising