ప్రజలకు మరింత చేరువవ్వాలి
ABN, First Publish Date - 2023-03-03T23:22:52+05:30
ప్రజలకు చేరువయ్యేందుకే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపడతున్నామని, విజయవంతం చేయాలని ఆ పార్టీ మహబూబ్నగర్ పార్ల మెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు.
‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’పై ఆ పార్టీ నాయకుడు శ్రీనివాస్
మహబూబ్నగర్ టౌన్, మార్చి 3 : ప్రజలకు చేరువయ్యేందుకే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపడతున్నామని, విజయవంతం చేయాలని ఆ పార్టీ మహబూబ్నగర్ పార్ల మెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడపగడపకు తెలుగుదేశం పార్టీని తీసుకువెళ్లి ‘ప్రజల కోసం, ప్రగతి కోసం- ఇంటింటికీ తెలుగుదేశం’ అనే నినాదంతో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచనలు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, నాయకురాలు ప్రతీ ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను కరపత్రాలు ముద్రించి చేరవేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బి. చంద్రశేఖర్రెడ్డి, మ హమ్మద్ కాసిం, నారాయణపేట నాయకులు వినయ్ మిత్రయాదవ్, నందకుమార్, భాస్కర్ రెడ్డి, ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, మురళి, కేశవులు, సలీం, మైబు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-03T23:22:52+05:30 IST