TS Assembly Polls : బీఆర్ఎస్‌కు గ్రామస్తులు ఝలక్.. వాహనం గ్రామంలోకి రాగానే ఏం చేశారంటే..!
ABN, First Publish Date - 2023-11-04T14:47:05+05:30
ఎన్నికలంటేనే సందడి.. హడావుడి అంటుంది. ఏ నలుగురు కలిసినా.. ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా ఇవే ఊసులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. మరోవైపు అభ్యర్థులందరూ తమ తమ ప్రచార రథాలపై డీజీ సౌండ్లు
ఎన్నికలంటేనే సందడి.. హడావుడి అంటుంది. ఏ నలుగురు కలిసినా.. ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా ఇవే ఊసులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. మరోవైపు అభ్యర్థులందరూ తమ తమ ప్రచార రథాలపై డీజీ సౌండ్లు పెట్టి ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే విషయాలను పాటలు, మాటల రూపంలో మైకుల ద్వారా తెలియజేస్తారు. ఇలా ప్రతీ పార్టీ నాయకులు చేసే పనే..! వాస్తవానికి పట్టణాల్లో కంటే పల్లెటూరులోనే ఎక్కువగా ఈ హడావుడి ఉంటుంది. ఓ వైపు సందడిగా అభ్యర్థులు నామినేషన్ల పర్వం జరుగుతుండగానే.. మరోవైపు ప్రచార రథాలు పల్లె పల్లెనా దూసుకుపోతున్నాయి. పోలింగ్‌కు ఇంకో మూడు వారాలే మిగిలుంది. దీంతో అభ్యర్థులంతా.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి లేనిపోని ఫీట్లు వేస్తున్నారు!.
ఓ లుక్కేయండి!
అయితే.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు గ్రామస్తులు ఝలక్ ఇచ్చారు. డీజే పాటలతో గ్రామంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాహనాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ అనూహ్య ఘటనతో ఆ పార్టీ కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. గ్రామస్థులంతా వాహనాన్ని చుట్టుముట్టి కర్రలతో బాది వెనక్కి వెళ్లిపోమంటూ కేకలు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళలు, వృద్ధులు నినాదాలు చేశారు. దీంతో చేసేదేమీలేక డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను షేర్ నెట్టింట్లో షేర్ చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. ఇదిగో అన్ని చోట్లా సీన్ ఇలానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రారని ప్రత్యర్థి పార్టీల నేతలు జోస్యం చెబుతున్నారు.
Updated Date - 2023-11-04T14:47:06+05:30 IST