Telangana Janagarjana: ఖమ్మం ‘తెలంగాణ జనగర్జన’పై మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి స్పందన..

ABN , First Publish Date - 2023-07-02T15:23:47+05:30 IST

ఆదివారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ జనగర్జన’ (Telangana Janagarjana) సభపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

Telangana Janagarjana: ఖమ్మం ‘తెలంగాణ జనగర్జన’పై మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి స్పందన..

ఖమ్మం: ఆదివారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ జనగర్జన’ (Telangana Janagarjana) సభపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఖమ్మం మహాసభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ ప్రసంగిస్తారని చెప్పారు. 1360 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు భట్టికి అభినందనలు తెలిపారు. పలువురు సీనియర్లు పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని, తెలంగాణ సమిష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా రాష్ట్రాభివృద్ధి, పురోగతికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు.

ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ... పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై డీజీపీకి రేవంత్‌రెడ్డి, మధుయాష్కీ ఫిర్యాదు చేశారు. సభకు కాంగ్రెస్‌ శ్రేణులు రాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్‌ కోరారు. పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గ్రామల నుంచి వచ్చే వాహనాలను అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఇక కోమటి రెడ్డి స్పందిస్తూ.. జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదని హెచ్చరించారు.

రాహుల్​సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 4 నెలల్లో కాంగ్రెస్ ​ప్రభుత్వం రాబోతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉందని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభకు భయపడి ప్రభుత్వం బస్సులు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రైవేట్ వాహనాలను కూడా ఆపి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు.

Updated Date - 2023-07-02T15:31:22+05:30 IST