Ponnam Prabhakar: సెంటిమెంట్‌గా ఉన్న హుస్నాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయాలేదు.. కేసీఆర్‌కు పొన్నం ప్రశ్న
ABN , First Publish Date - 2023-10-14T12:59:26+05:30 IST
ఎన్నికల సెంటిమెంట్ కోసం హుస్నాబాద్‌ను వాడుకుంటున్న సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌కు సమానంగా హుస్నాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
సిద్దిపేట: ఎన్నికల సెంటిమెంట్ కోసం హుస్నాబాద్‌ను వాడుకుంటున్న సీఎం కేసీఆర్ (CM KCR) సెంటిమెంట్‌కు సమానంగా హుస్నాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Former MP Ponnam Prabhakar) ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2014కు ముందే 70% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును కూర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదో బహిరంగ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాల మధ్య భూ నిర్వాసితులను అణిచివేసి కూడా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల లాగా హుస్నాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తుల్లో భాగంగా గత ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం సీపీఐకి కేటాయించామని.. ఈ ఎన్నికల్లో మాత్రం హుస్నాబాద్‌ను కాంగ్రెస్‌కు వదిలిపెట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజలను మభ్యపెట్టడానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ మేనిఫెస్టో దిమ్మె తిరిగేలా ఉంటుందంటున్న బీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ఇదివరకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు దిమ్మ తిరిగే తీర్పిస్తారని అన్నారు. బీఆర్ఎస్ తాయిలాలు తీసుకొని ఎన్నికల్లో మాత్రం ఓటుతో ప్రజలు మార్పుకు పట్టం కట్టాలని కోరారు. నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ హత్యే అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు.