Ponnam Prabhakar: ప్రజాపాలన విజయవంతం చేయాలి.. కార్యకర్తలకు పొన్నం దిశానిర్దేశం
ABN , Publish Date - Dec 27 , 2023 | 09:43 AM
Telangana: జిల్లాలోని హుస్నాబాద్‌లో ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతీ కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు.
సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్‌లో ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) దిశానిర్దేశం చేశారు. 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతీ కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. అప్పులపై స్వేద పత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు, ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌధ పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ప్రతీ నెల ఒకటవ తేదీ నుండి ఐదో తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.