ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP MLA: మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైర్

ABN, First Publish Date - 2023-10-03T14:14:01+05:30

మంత్రి హరీష్‌రావుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చినట్లు మళ్లీ ప్రొసీడింగ్స్ కాగితాలకే పరిమితం తప్ప చేసింది ఒక్క పని ఉండదన్నారు.

సిద్దిపేట: మంత్రి హరీష్‌రావుపై (Minister Harish RAo) దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Dubbaka MLA Raghunandan rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చినట్లు మళ్లీ ప్రొసీడింగ్స్ కాగితాలకే పరిమితం తప్ప చేసింది ఒక్క పని ఉండదన్నారు. దుబ్బాక నుంచి ముస్తాబాద్, మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసింది తమరు కాదా హరీష్ అని ప్రశ్నించారు. దౌల్తాబాద్ నుంచి చేగుంట రోడ్డుకు సెంట్రల్ ఫండ్ తెచ్చింది నిజం కాదా అని నిలదీశారు. పైసలు లేవని సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా పైసలు ఉన్నోళ్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా హరీష్ రావు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్త అని సవాల్ విసిరారు.


‘‘ఉప ఎన్నికల్లో కారుకు ఫంక్చర్ చేసి పంపిచ్చిన.. నాతో పెట్టుకోవద్దు.. మళ్లీ అదే పరిస్థితి వస్తది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని ప్రమాణం చేసే మీరు మిమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తామనడం దేనికి సంకేతం. దుబ్బాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బగొట్టే ప్రయత్నం హరీష్ రావు చేస్తుండు అది తగదు. సిద్దిపేటకు రైలు వచ్చిందంటే ఆ ఘనత నరేంద్ర మోడీది కాదా. హబ్సీపూర్ నుంచి దుబ్బాకకు ఫోర్ లైన్ మంజూరైందని గతంలో రామలింగన్న ప్రకటిస్తే అది ఇంతవరకు కాకుండా ఆపింది నువ్వు కాదా. రఘునందన్ రావుకు పేరొస్తదని ఆపడం కాదు.. చాతనైతే ఫోర్ వేకు నిధులు మంజూరు చేయి. గజ్వేల్ నియోజకవర్గంకు రైలు ఇచ్చింది మా మోడీ ప్రభుత్వం. దుబ్బాకలో ఏది పడితే అది మాట్లాడితే నీకు తగిన బుద్ధి చెబుతారు దుబ్బాక ప్రజలు. నీ కోమటి చెరువుకు ఖర్చు చేసిన డబ్బులు దుబ్బాక నియోజక వర్గానికి ఇవ్వలేదు. గతంలో ఎన్ని జిమ్మిక్కులు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరిగుతుంది. తాటాకు చప్పుల్లతో, ఉడుత చూపులకు భయపడేది రఘునందన్ రావు కాదు. గతంలో జర్నలిస్టులకు 25 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చి ఇంతవరకు మొదలు లేదు మోక్షం లేదు’’ అంటూ రఘునందన్‌రావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-03T14:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising