Dharmapuri Arvind: కాంగ్రెస్‌లోకి వెళ్లేవాళ్లంతా నెక్ట్స్ చేసే పని అదే!
ABN , First Publish Date - 2023-06-27T17:05:48+05:30 IST
కాంగ్రెస్‌లో చేరికలపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరే వారంతా త్వరలో బీజేపీలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో భారీ చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టే. ముఖ్యమంత్రి కేసీఆర్ పని కట్టుకుని కాంగ్రెస్‌కు హైప్ చేయిస్తున్నారు. తొందరపడి
నిజామాబాద్: కాంగ్రెస్‌లో చేరికలపై ఎంపీ అర్వింద్ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరే వారంతా త్వరలో బీజేపీలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో భారీ చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టే. ముఖ్యమంత్రి కేసీఆర్ పని కట్టుకుని కాంగ్రెస్‌కు హైప్ చేయిస్తున్నారు. తొందరపడి ఎవరు కాంగ్రెస్‌లోకి వెళ్లొద్దు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీనే.. కాంగ్రెస్ ఎక్కడ ఉంది..? అమిత్ షా.. కేటీఆర్‌తో (KTR) సమావేశం అయ్యారని రేవంత్‌కు ఎవరు చెప్పారు..?. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎలా ఒక్కటైందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.?. బీఆర్ఎస్‌కు దూరంగా ఉన్నామంటూ అసదుద్దీన్ చెప్పడం విడ్డూరం. కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్‌కు ప్రయోజనం ఉండదు. షరతులు పెట్టి కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నారు. ఖమ్మంలో ఎలా గెలవాలో బీజేపీకి స్ట్రాటజీ మాకుంది. చట్టానికి ఎవరు అతీతులు కారు.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పుదు. కుటుంబ పార్టీలకు ఓటేస్తే వాళ్ల ఆస్తులు పెరుగుతాయి. పిల్లలకు మంచి భవిష్యత్ కావాలంటే బీజేపీకి ఓటు వేయాలి.’’ అని అర్వింద్ విజ్ఞప్తి చేశారు.