ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: కేటీఆర్ షాడో సీఎం

ABN, First Publish Date - 2023-09-26T19:18:44+05:30

ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ జిల్లా: ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నగరంలోని గిరిరాజ్ కాలేజీ మైదానలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోద పర్యటన వస్తారు. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌కు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం. ఖమ్మంలో కూడా పార్టీ బలపడింది. మోదీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా ఉండబోతోంది. మోదీ పర్యటన తర్వాత అమిత్‌షా, నడ్డా పర్యటనలు ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం. హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం మాకు లేదు. కేటీఆర్ షాడో సీఎం. తెలంగాణ కేటీఆర్ జాగీరా..? 17 సార్లు నోటిఫిసెషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ నేతల ఎజెండాలో మేము పడబోం. ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నిర్ణయం సరైనదే. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T19:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising