KTR: అర్వింద్ కుసంస్కారి.. రేవంత్ తెలంగాణకు పట్టిన వ్యాధి
ABN, First Publish Date - 2023-08-09T17:56:15+05:30
నిజామాబాద్ ఎంపీ కుసంస్కారంగా.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. హిందువులు, ముస్లింలు అంటూ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిజామాబాద్ అభివృద్ధి చెందింది. కొంతమంది ఎలక్షన్ రాగానే మీ ముందుకు వస్తారు.
నిజామాబాద్: నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఒక్క మంచి పనైనా చేశారా? అంటూ మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తారు. ‘‘నిజామాబాద్ ఎంపీ కుసంస్కారంగా.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. హిందువులు, ముస్లింలు అంటూ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిజామాబాద్ అభివృద్ధి చెందింది. కొంతమంది ఎలక్షన్ రాగానే మీ ముందుకు వస్తారు. గతంలో నక్సలిజం, తీవ్రవాదంతో ఆగమైన తెలంగాణ.. ఇప్పుడు నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించింది. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉంటే కొందరికి మనసున పడ్తలేదు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కసారి అవకాశం ఇవ్వమని అంటున్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? మళ్లీ ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణవాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి. మాది గల్లీ పార్టీ.. వారిది ఢిల్లీ పార్టీ. ఢిల్లీ బానిసలైన కాంగ్రెస్, బీజేపీ వారికి.. తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. నిజామాబాద్ నగరంలో అంతర్గత రహదారులకు రూ.60 కోట్లు మంజూరు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి గణేష్ బిగాలను భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని మంత్రి ప్రజలను కోరారు.
Updated Date - 2023-08-09T17:59:14+05:30 IST