Dharmapuri Arvind: అదే జరిగితే కేసీఆర్ పాకిస్తాన్ పోవాల్సిందే
ABN , First Publish Date - 2023-07-11T17:16:28+05:30 IST
మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలి. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చెస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? యూసీసీ బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్తాన్ పోవాల్సిందే.
నిజామాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) కౌంటర్ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలి. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చెస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? యూసీసీ బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్తాన్ పోవాల్సిందే. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడతాయన్న భయం కేసీఆర్‌లో మొదలైంది. అందుకే ముస్లిం మత పెద్దలను పిలుచుకుని కేసీఆర్ మీటింగ్ పెట్టుకున్నారు. యూసీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకున్నా పాస్ అవుతుంది. యూసీసీ బిల్లు పాస్ అయ్యాక కేసీఆర్ పాకిస్తాన్ పోతానంటే వెళ్లిపోవచ్చు. 24 గంటల విద్యుత్‌పై రేవంత్ కామెంట్స్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పారు.’’ అని అర్వింద్ వ్యాఖ్యానించారు.