KA Paul: పార్టీ గుర్తు కేటాయించకుండా వేధింపులు.. సింబల్ కోసం దీక్ష చేయాలా?
ABN, First Publish Date - 2023-11-09T16:45:57+05:30
పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ (Prajashanti Party Chief KA Paul) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను (Central Election Commission officials) కలిసిన కేఏ పాల్ ఆపై మీడియాతో మాట్లాడుతూ..సెప్టెంబర్‌లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంత వరకు గుర్తు కేటాయించలేదన్నారు. పార్టీ యాక్టివ్2గా ఉన్న యాక్టివ్‌గా లేదని చెప్తున్నారన్నారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదని విమర్శించారు. పోటీ చేయని వైస్సార్ తెలంగాణ పార్టీకి కూడా గుర్తు కేటాయించారని.. కానీ తమకు కేటాయించడం లేదని మండిపడ్డారు. తెలుగు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయన్నారు. నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తే సింబల్ ఏంటి అని అడుగుతున్నారన్నారు. తనకు ఎందుకు ఇంతలా నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని.. సింబల్ కోసం నిరాహారదీక్ష చేయాలి? అని ఆయన ప్రశ్నించారు.
హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయిస్తారో చెప్పడం లేదన్నారు. ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప కేటాయించడం లేదన్నారు. ‘‘చట్టాలు మారాలంటే నాలాంటి వాడు ఎంపీ అవ్వాలి.. నా పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేసాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించి, నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా శాంతి పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. ప్రచారం చేసేందుకు సమయం కేటాయించాలనే పోటీకి దూరంగా ఉన్నట్లు కేఏ పాల్ వెల్లడించారు.
Updated Date - 2023-11-09T16:45:59+05:30 IST