ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
ABN, First Publish Date - 2023-12-06T23:31:22+05:30
అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగాఉంటామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
వికారాబాద్/మోమిన్‌పేట్ డిసెంబరు 6: అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగాఉంటామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుందామని, భవిష్యత్తులో మీ వెంట నేనుంటానన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ అనునిత్యం పార్టీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. గెలిచినా ఓడినా తన చివరి రక్తపు బొట్టు వరకు వికారాబాద్ ప్రజలుకోసమే పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా మోమిన్‌పేట్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు డి.వెంకట్, ఎన్.నర్సింహ్మారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-12-06T23:31:25+05:30 IST