ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Ranjith Reddy: బండి సంజయ్.. కరెంట్ వైర్లను పట్టుకో.. 24 గంటలు కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుంది

ABN, First Publish Date - 2023-08-12T17:20:52+05:30

తెలంగాణలో 24గంటల కరెంట్(24 hours current in Telangana) వస్తుందో లేదో తెలియాలంటే కరెంట్ వైర్లను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పట్టుకొని చూడాలని అప్పుడు కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి(BRS MP Ranjith Reddy) అన్నారు.

వికారాబాద్ జిల్లా: తెలంగాణలో 24గంటల కరెంట్(24 hours current in Telangana) వస్తుందో లేదో తెలియాలంటే కరెంట్ వైర్లను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పట్టుకొని చూడాలని అప్పుడు కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి(BRS MP Ranjith Reddy) అన్నారు. శనివారం నాడు వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్ మామిడి గ్రామంలో పర్యటించారు. తెలంగాణలో 24గంటల సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏదో ప్రేమున్నట్లు ఒలకబోస్తారని..ఈ రెండు పార్టీల నేతల మాటలను రైతులు నమ్మరని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రైతులను నట్టేటా ముంచాయని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడో ఒక దగ్గర మీటర్ రీడింగ్ చూశాం రావడం లేదంటారు.... కరెంట్ ఎక్కడ అవసరమో అక్కడ ఇస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌లో బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారన్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటారు... అభివృద్ధి జరగనిదే ప్రతి హెక్టార్లలో రాష్ట్రానికి 35శాతం అవార్డులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండానే అవార్డులు ఇస్తున్నారా.... కావాలంటే అభివృద్ధిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఎంపీ రంజిత్‌రెడ్డి సవాల్ విసిరారు.

Updated Date - 2023-08-12T17:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising