Revanth Reddy: కాంగ్రెస్‌కు భయపడిన వ్యక్తికి మంత్రి పదవా..?

ABN , First Publish Date - 2023-08-24T16:37:50+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి భయపడిన వ్యక్తికి బీఆర్ఎస్‌లో మంత్రి పదవీ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సెటైర్లు వేశారు.

Revanth Reddy:  కాంగ్రెస్‌కు భయపడిన వ్యక్తికి మంత్రి పదవా..?

వికారాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీకి భయపడిన వ్యక్తికి బీఆర్ఎస్‌లో మంత్రి పదవీ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సెటైర్లు వేశారు. గురువారం నాడు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించారు. పూడూరు మండలం మన్నేగూడ జేకే ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ చేవెళ్ల ‘‘ప్రజాగర్జన’’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదు. మాదిగ బిడ్డలు బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలి.ముదిరాజ్‌లను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. సుప్రీంకోర్టులో మీ తరపున వాదిస్తాం. పాలమూరు ఎత్తిపోతల(Palamuru lifts) పూర్తి చేయడం సీఎం కేసీఆర్‌(CM KCRకు ఇష్టం లేదు. కృష్ణా నది జలాలు వికారాబాద్ జిల్లాకు ఎందుకు తేలేదనీ అడిగితే ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)అడ్డుపడుతున్నాడని కేసీఆర్ చెబుతున్నారు. మరి జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి భోజనం పెట్టినప్పుడు తెలియదా.? నీళ్లు జగన్‌రెడ్డి తీసుకెళ్లాడు. నిధులు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. నియామకాలు కేసీఆర్ ఇంట్లోకి పోయాయి. ఇందిరమ్మ రాజ్యం తెచ్చి తెలంగాణలో దళిత గిరిజనులను ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామో డిక్లరేషన్ ద్వారా వివరిస్తాం.

చేవెళ్ల సెంటిమెంట్‌తో నిర్వహించే సభను అందరూ కలిసి విజయవంతం చేయాలి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి రావల్సిన సాగునీరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. గోదావరి జలాలన్ని మావే అంటూ తమ నియోజకవర్గాలకు మళ్లించుకున్నాడు. ఆయన ఫాంహౌస్ చుట్టూ కాలువలు చేసుకొని సిరిసిల్ల, గజ్వేల్‌కే నీళ్లు ఇస్తా అంటున్నారు.ఈ ప్రాంతానికి కేసీఆర్ సీఎం కాదా....? ఈ ప్రాంతంలో ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఆలోచించాలి...కేసీఆర్ ఒక్క ముదిరాజ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు.ముదిరాజ్ బిడ్డలు తెలంగాణ వారు కారా....వీరు తెలంగాణ ఉద్యమంలో లేరా. ముదిరాజ్ బిడ్డలు కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి’’ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉందా.....డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్న ఊర్లు ఏమైనా ఉన్నయా ప్రజలు ఆలోచించాలి అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘వికారాబాద్‌(Vikarabad)లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురే‌స్తాం. ఈనెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల సభను మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారని రేవంత్‌రెడ్డి ముందే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26 న జరిగే చేవెళ్ల సభకు ఎఐసీపీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వస్తారు.సభలో రాష్ట్ర రాజకీయాలు, దళిత గిరిజన అభ్యున్నతి కోసం డిక్లరేషన్ ప్రకటిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-24T17:12:44+05:30 IST