Revanth Reddy: మంత్రి జగదీష్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. రాజీనామాకు డిమాండ్
ABN, First Publish Date - 2023-07-18T20:57:30+05:30
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై (Minister Jagdish Reddy) టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై (Minister Jagdish Reddy) టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు.
"ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే.. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు 24గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామంటున్నారు. తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా?. జగదీష్ రెడ్డి నువ్వు మంత్రివా? లేక ఆ శాఖలో బంట్రోతువా?. అసలు నువ్వు ఎప్పుడైనా ఉచిత కరెంటుపై సమీక్ష చేశావా?. ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు విద్యుత్ ఉద్యోగుల ఖాతాలో పడేవి. కానీ బీఆరెస్ పాలనలో 20వ తేదీ వచ్చినా వారి ఖాతాల్లో జీతాలు పడటం లేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి విద్యుత్ శాఖ దిగజారింది. ఇందుకు సిగ్గుతో తలవంచుకుని జగదీష్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. విద్యుత్ ఉద్యోగులకు, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది జగదీష్ రెడ్డే". అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Updated Date - 2023-07-18T20:59:09+05:30 IST