Share News

శిల్పారామంలో ‘సంకల్ప్ దివస్ 2023’ సెలబ్రేషన్స్.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-11-24T23:21:18+05:30 IST

శిల్పారామంలో ‘సంకల్ప్ దివస్ 2023’ సెలబ్రేషన్స్.. ఎప్పుడంటే?

శిల్పారామంలో ‘సంకల్ప్ దివస్ 2023’ సెలబ్రేషన్స్.. ఎప్పుడంటే?

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిరిండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అవార్డ్ ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’. మానవతావాది, వ్యాపార వేత్త లయన్ డాక్టర్ వై.కిరణ్ జన్మదినం సందర్భంగా ‘సంకల్ప్ దివస్’ పేరుతో ప్రతి సంవత్సరం నవంబర్ 28న జరుపుతుంటారు. ఈ సంవత్సరం ఈ సంప్రదాయ వేదికకు శిల్పారామం వేదిక కాబోతోంది.

సంకల్ప్ దివస్‌ అనేది.. సాధారణ ప్రజానీకం మరియు కార్పొరేట్‌ సమాజంలో అంతర్భాగంగా మారడానికి మరియు ఇతరులను తమ దినచర్య నుండి కొంత సమయం వెచ్చించి సమాజానికి తిరిగి అంకితం చేసుకునేలా ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. వార్షిక వ్యవహారాన్ని సాదారణ పార్టీలా జరుపుకోవడానికి బదులుగా.. సుచిరిండియా ఫౌండేషన్ సమాజంలోని వివిధ ప్రముఖుల సేవలను గుర్తించి వారిని సత్కరిస్తుంది. అన్నా హజారే, సుందర్ లాల్ బహుగుణ, సందీప్ పాండే, డా. ప్రకాష్ ఆమ్టే & డాక్టర్ మందాకిని ఆమ్టే, మహేష్ చంద్ర మెహతా, జాకిన్ అర్పుతం, చండీ ప్రసాద్ భట్, కులందై ఫ్రాన్సిస్, డా.కిరణ్ బేడి, శ్రీమతి నఫీసా అలీ ఇలాంటి గొప్ప సామాజిక కార్యకర్తలను గత 18 సంవత్సరాలలో ఈ సంస్థ సత్కరిస్తూ వస్తుంది.

ఈ సంవత్సరం.. పద్మవిభూషణ్, భారతీయ ఒలింపిక్ బాక్సర్, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు అయిన శ్రీమతి మేరీ కోమ్‌కు ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్ 2023’ అవార్డుకు అందజేయనున్నారు. మేరీ కోమ్ ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆరుసార్లు గెలుచుకున్న ఏకైక మహిళ అని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సుచిరిండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన లయన్ డాక్టర్ వై.కిరోన్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తులు మనలో చాలా మంది ఉన్నారని, ఈ సంకల్ప్ అవార్డులు వారి గొప్ప పనిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహించడానికే ఈ ప్రయత్నం అని తెలిపారు.

Updated Date - 2023-11-24T23:22:46+05:30 IST