Sharmila: హామీ నెరవేర్చాలన్న చిత్తశుద్ది లేదంటూ సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు
ABN , First Publish Date - 2023-09-10T17:51:03+05:30 IST
సీఎం కేసీఆర్‌పై (KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై (KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.
"రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎట్లున్నదో సొసైటీల ముందట. ఎరువుల కోసం నిలుసున్న రైతన్నలను అడిగితే తెలుస్తది. ఇదేనా దొరా.. మీరు చెప్తున్న రైతు రాజ్యం?. ఎరువుల కోసం పడిగాపులు కాయడమేనా రైతు సంక్షేమం?. పంట పండించేందుకు సాయం లేదు. పండిన పంట కొనేందుకు దిక్కులేదు. రాష్ట్ర రైతులకు 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితం అని ఊదరగొట్టారు. 55 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం అన్నారు. కేసీఆర్ పుట్టిందే ఇందుకోసం అని గప్పాలు కొట్టారు. ఏ రాష్ట్రం అమలు చేయలే అంటూ గొప్పలు చెప్పారు. ప్రగతి భవన్ వేదికగా, రైతుల సాక్షిగా హామీ ఇచ్చి ఆరేండ్లు దాటినా దొర మాటకు విలువ లేదు. ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న చిత్తశుద్ది లేదు. ఉచితం మాట అటుంచితే ఎరువులు కొందామన్నా దొరకని పరిస్థితి. రైతును రాజు చేశానని గప్పాలు కొట్టుకుంటూ ఎరువుల కోసం సొసైటీల ముందట నిల్చోబెట్టారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. కేసీఆర్ పుట్టిందే రైతులను నట్టేట ముంచడానికి అని నిరూపించిన దొర చంద్రబాబు. మీ రాజకీయాలు పక్కనబెట్టి రైతులు పడుతున్న కష్టాలను చూడండి. తక్షణమే ఎరువుల కొరత లేకుండా చూడండి. ఈ ఖరీఫ్ కైనా ఉచిత ఎరువులు ఇచ్చి మాట నిలబెట్టుకోండి." అని షర్మిల సూచించారు.