Sharmila Reddy: సంబురాలంటే క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడమా?.. కేసీఆర్, కేటీఆర్‌పై షర్మిల ఫైర్

ABN , First Publish Date - 2023-08-02T17:35:21+05:30 IST

: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై (CM KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.

Sharmila Reddy: సంబురాలంటే క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడమా?.. కేసీఆర్, కేటీఆర్‌పై షర్మిల ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై (CM KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.


"వరద బాధితులకు సాయం అందక చస్తుంటే.. కేసీఆర్ చారిత్రక నిర్ణయాలపై సంబురాలు చేసుకోవాల్నా చిన్న దొర?. వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా?. 10 వేల ఎకరాల్లో పంటలు మునిగి అన్నదాత కన్నీరు పెడుతుంటే మీకు సంబరమా?. రైతన్నలకు రూ.2 వేల కోట్ల నష్టం జరిగితే మీకు సంబరమా?. చారిత్రక నిర్ణయాలు అంటే ఏంటి? మీ అయ్య రుణమాఫీ చేయకపోవడమా?. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడమా? డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వకపోవడమా?. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడమా?. క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడమా?.104 సేవలను ఎత్తేయడమా?. రూ.4 లక్షల కోట్లు పంది కొక్కుల్లా పీక్కుతినడమా?." అని కేటీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు.


"సిగ్గు లేకుండా వరద బాధితులకు రూ.10 వేలు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్‌ది. పంట పరిహారం ఇవ్వకుండా, పంట బీమా ఇవ్వకుండా నిండా ముంచిన చరిత్ర కేసీఆర్‌ది. పోడు పట్టాల పేరుతో, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో దగా చేసిన చరిత్ర కేసీఆర్‌ది. కరెంట్ నుంచి రిజిస్ట్రేషన్ల వరకు రేట్లు పెంచి ప్రజల రక్తం తాగిన చరిత్ర కేసీఆర్‌ది. వీధికో బెల్టు షాపు పెట్టి, మహిళల మంగళ సూత్రాలు తెంపిన చరిత్ర కేసీఆర్‌ది. మీ దిక్కుమాలిన నిర్ణయాలకు, దగాకోరు పాలనకు, మోసపూరిత హామీలకు కేసీఆర్‌కు చేయాల్సింది సంబురాలు కాదు బడితపూజ. సంబరాలు చేసుకుంటుంది తెలంగాణ ప్రజలు కాదు కేసీఆర్ కుటుంబం మాత్రమే." అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-02T17:36:32+05:30 IST