Kishan Reddy: కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైంది
ABN , First Publish Date - 2023-08-27T16:59:34+05:30 IST
సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైంది. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడం లేదు. వరి వేయొద్దని కేసీఆర్ ప్రభుత్వమే చెబుతోంది. వ్యవసాయ రుణాలు పావలా వడ్డీకి ఇవ్వట్లేదు. తెలంగాణలో 75 శాతం కౌలు రైతులే ఉన్నారు. కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూతూ మంత్రంగా రుణమాఫీలు చేస్తున్నారు. రైతులకు కేసీఆర్ సర్కార్ వెన్నుపోటు పొడిచింది. కేసీఆర్ ప్రభుత్వం పంటబీమా పథకాన్ని అమలు చేయట్లేదు. కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది?. రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.