TS News : తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

ABN , First Publish Date - 2023-07-20T09:44:10+05:30 IST

తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ వేదికగా మెసేజ్ పెట్టారు. ‘‘భారీ వర్షాల కారణంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించారు.

TS News : తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

హైదరాబాద్ : తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ వేదికగా మెసేజ్ పెట్టారు. ‘‘భారీ వర్షాల కారణంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించారు. అయితే కొన్ని పాఠశాలలు ఉదయాన్నే ప్రారంభమవుతుండటంతో సబిత ప్రకటన వచ్చే వరకూ కాస్త లేట్ అయింది. దీంతో కొన్ని స్కూళ్లకు చెందిన పిల్లలు పాఠశాలలకు వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులంతా స్కూళ్లకు వెళ్లాక.. సెలవులు ప్రకటించడమేంటంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షాల విషయంలో ప్రభుత్వానికి ముందు జాగ్రత్తలు లేవని తల్లిదండ్రులు సైతం విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2023-07-20T10:03:16+05:30 IST