రెపరెపలాడిన ఉద్వేగం

ABN , First Publish Date - 2023-01-26T23:56:31+05:30 IST

నగరంలోని భద్రకాళి బండ్‌పై ఏర్పాటైన 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు. 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం పతాకావిష్కరణ జరిగింది. మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్‌, ‘కుడా’’చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌, బల్దియా కమిషనర్‌ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెపరెపలాడిన ఉద్వేగం
భద్రకాళి బండ్‌పై ఏర్పాటైన 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండా.

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జనవరి 26 : నగరంలోని భద్రకాళి బండ్‌పై ఏర్పాటైన 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు. 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం పతాకావిష్కరణ జరిగింది. మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్‌, ‘కుడా’’చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌, బల్దియా కమిషనర్‌ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్ర్టిక్‌ మోటార్‌ స్విచ్‌ ద్వారా జాతీయ పతాకాన్ని వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమన్నారు. దేశంలోని ఏరాష్ట్రంలోని లేని ప్రజారంజక పాలన తెలంగాణలో ఉందన్నారు. మేయర్‌ గుండు సుధారాణి మాట్లాడుతూ.. 150అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఏర్పాటు పనులను పక్షం రోజుల్లో అధికారులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలన అవశ్యతకపై లయోలా పాఠశాల విద్యార్థుల నృత్య రూపక ప్రదర్శన ఆకట్టుకుంది. కాగా, భద్రకాళి బండ్‌పై నూతనంగా ఎగరేసిన జెండాను అవనతం చేయరు. హైదరాబాద్‌లోని హస్సేన్‌సాగర్‌ చెంతన నిరంతరం ఎగిరే జెండా వలెనే, ఇక్కడ కూడా రెపరెపలాడుతూనే ఉంటుంది.

Updated Date - 2023-01-26T23:56:32+05:30 IST