Hanumakonda: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2023-09-05T17:16:35+05:30
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వివిధ విభాగాలలోని పీహెచ్‌డి కేటగిరి-2 అడ్మిషన్‌లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో ఉద్రిక్తత (Tension) నెలకొంది. వివిధ విభాగాలలోని పీహెచ్‌డి (PHd) కేటగిరి-2 (Category-2) అడ్మిషన్‌లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు (Student Unions) ఆందోళన చేపట్టాయి. ఒకానొక దశలో విద్యార్థులు వీసీ ఛాంబర్‌లోకి దూసుకువెళ్లారు. వీసీ రమేష్ (VC Ramesh), రిజిష్ట్రార్ (Registrar) శ్రీనివాసరావు (Srinivasa Rao)తో వాగ్వాదానికి దిగారు. 75 శాతం అడ్మిషన్లను వీసీ, రిజిస్ట్రార్, ఆల్ డీన్స్ అమ్ముకున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి.. పర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-09-05T17:16:35+05:30 IST