ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharmila: అమరుల పేర్లూ తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు

ABN, First Publish Date - 2023-06-23T12:31:16+05:30

500 మంది ప్రాణాలు అర్పిస్తే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు కేసీఆర్‌ది. అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తనని.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే కానీ వారి పేర్లు ఎక్కడా చెక్కలేదు. అమరుల త్యాగం.. దొరకు దక్కిన అధికార వైభోగం’’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టినవారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ పుట్టుకొచ్చింది

సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వైఎస్‌ షర్మిల విమర్శ

హైదరాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘‘1500 మంది ప్రాణాలు అర్పిస్తే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు కేసీఆర్‌ది (CM KCR). అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తనని.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే కానీ వారి పేర్లు ఎక్కడా చెక్కలేదు. అమరుల త్యాగం.. దొరకు దక్కిన అధికార వైభోగం’’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టినవారు ఎందరో ఉంటే ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే అమరులు యాదికొచ్చారని పేర్కొన్నారు. శంకరమ్మకు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తాడట.. కొత్తగా అమరులకు న్యాయం చేస్తాడట అని వ్యాఖ్యానించారు. ‘‘అమరుల ఆశయాలు గోదారి పాలైతే.. స్వరాష్ట్ర సంపదంతా కేసీఆర్‌ పాలైంది. నిధులు మింగె, నీళ్లు ఎత్తుకుపోయె.. ఉద్యోగాలు ఇంట్లనే ఇచ్చుకున్నడు. ప్రజల త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర అమరువీరుల కుటుంబాలను ఆదరించడం మరిచిండు. ఇన్నాళ్లూ వాళ్లెవరో అన్నట్లు, అసలు గుర్తుకు లేనట్లు నాటకాలు ఆడిండు. 9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ మళ్లీ పుట్టుకొచ్చింది’’ అని మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకుని తెలంగాణ తల్లికి ఆత్మఘోష మిగిల్చిన మారీచుడు కేసీఆర్‌ అని నిప్పులు చెరిగారు. ఏడాదిలోనే ప్రగతిభవన్‌ కట్టుకున్న దొరకు.. అమరుల స్మారక చిహ్నం పూర్తి చేయడానికి తొమ్మిదేళ్లు పట్టిందని విమర్శించారు.

Updated Date - 2023-06-23T12:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising