YS Sharmila: కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదు

ABN , First Publish Date - 2023-07-27T21:24:13+05:30 IST

సీఎం కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ బిడ్డలకు లేదని బీఆర్ఎస్ సర్కారుపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణే లేదని, కంటికి కనపడకుండా పోతున్నా పట్టింపే లేదని అన్నారు. బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్‌లో మొద్దు నిద్ర పోతున్నడని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

YS Sharmila: కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ బిడ్డలకు లేదని బీఆర్ఎస్ సర్కారుపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణే లేదని, కంటికి కనపడకుండా పోతున్నా పట్టింపే లేదని అన్నారు. బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్‌లో మొద్దు నిద్ర పోతున్నడని తీవ్ర స్థాయిలో విమర్శించారు.


రెండేళ్లలో 34,495 మంది మహిళలు, 8,066 మంది అమాయక బాలికలు కనిపించకుండా పోయారంటే కేసీఆర్ తలదించుకోవాలని అన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట అని చెప్పుకున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఆడవారి పట్ల వివక్ష చూపే బందిపోట్ల పాలనలో కనీసం మిస్సింగ్ కేసులు నమోదైనా దర్యాప్తు శూన్యమేనని నైరాశ్యం వ్యక్తం చేశారు. కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదని, దేశంలోనే నం.1 అని చెప్పే పోలీసింగ్ వ్యవస్థ మహిళలు మాయం అవుతుంటే దొరకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. పసిగట్టాల్సిన నిఘా వ్యవస్థ దొర లెక్కనే నిద్ర పోతుందని విమర్శించారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధ.. మహిళల మిస్సింగ్‌పై లేదన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు.

Updated Date - 2023-07-27T21:27:02+05:30 IST