Anantapur: శ్రీరంగ రంగా..!
ABN, Publish Date - Oct 30 , 2024 | 09:34 AM
ఏళ్ల గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవంతో శింగనమల శ్రీరంగరాయలచెరువు(Shinganamala Srirangarayalacheruvu) కింద కాలువలు ధ్వంసమయ్యాయి. కాలువల పొడువునా కంపచెట్లు, జనుము పెరిగిపోయింది. జిల్లాలో అతిపెద్ద చెరువుగా ఉన్న శ్రీరంగరాయలచెరువు కింద 2,500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ భూమికి నాలుగు కాలువల ద్వారా నీరు సరఫరా అవుతుంది.
- ధ్వంసమైన శ్రీరంగరాయలచెరువు కాలువలు
- పెరిగిపోయిన కంపచెట్లు, జనుము
- ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని వైనం
- బీడుగా మారిన ఆయకట్టు భూములు
శింగనమల(అనంతపురం): ఏళ్ల గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవంతో శింగనమల శ్రీరంగరాయలచెరువు(Shinganamala Srirangarayalacheruvu) కింద కాలువలు ధ్వంసమయ్యాయి. కాలువల పొడువునా కంపచెట్లు, జనుము పెరిగిపోయింది. జిల్లాలో అతిపెద్ద చెరువుగా ఉన్న శ్రీరంగరాయలచెరువు కింద 2,500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ భూమికి నాలుగు కాలువల ద్వారా నీరు సరఫరా అవుతుంది. గత పదేళ్లుగా చెరువులో సమృద్ధిగా నీరు ఉన్నా ఒక తూము కింద ఆయకట్టు భూములకే సరఫరా అవుతోంది. ఆ ఆయకట్టు రైతులు మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు. ఇక చిన్నకాలువ, పెద్దకాలువ పతిమల కాలువ కింద ఉన్న చివరి ఆయకట్టు వరకు నీరు పారడం లేదు.
ఈ వార్తను కూడా చదవండి: Tirumala: శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..
ఎక్కడ పడితే అక్కడ కాలువలు ధ్వంసం కావడం, కంపచెట్లు జనుము పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వీటిని తొలగించడానికి ప్రతి ఏటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్ల నుంచి పతిమల తూము కింద పంట సాగు చేసిన దాఖలాలే లేవు. దానితో కాలువ పొడువునా ఆయకట్టు భూముల్లో కంపచెట్టు పెరిగి అడవిని తలపిస్తోంది. ఈ కాలువలకు 20 సంవత్సరాలు కిందట మరమ్మతులు చేసిన ట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఎవరిని అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వమైనా చర్యలు తీసుకుని కాలువకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పదేళ్ల నుంచి బీడుగానే ఉంచాం..
మాకు పతిమల తూము కింద చివరిలో భూమి ఉంది. పదేళ్ల కిందట పంట సాగు చేసేవాళ్లం. మా భూమి ఆయకట్టుకు చివరిగా ఉండటం, కాలువ పొడవునా కంపచెట్లు, జనుము పెరగడం, కాలువకు ఉన్న రాళ్ల ధ్వంసం కావడంతో నీరు రావడం లేదు. దీంతో పదేళ్లుగా బీడుగా ఉంచాం.
- లక్ష్మన్న, గోవిందరాయునిపేట, రైతు
పదేళ్ల నుంచి బీడుగానే ఉంచాం..
మాకు పతిమల తూము కింద చివరిలో భూమి ఉంది. పదేళ్ల కిందట పంట సాగు చేసేవాళ్లం. మా భూమి ఆయకట్టుకు చివరిగా ఉండటం, కాలువ పొడవునా కంపచెట్లు, జనుము పెరగడం, కాలువకు ఉన్న రాళ్ల ధ్వంసం కావడంతో నీరు రావడం లేదు. దీంతో పదేళ్లుగా బీడుగా ఉంచాం.
- లక్ష్మన్న, గోవిందరాయునిపేట, రైతు
ఇబ్బంది పడాల్సిందే
మాకు పెద్ద కాలువ కింద భూమి ఉంది. ఈకాలువ కింద పంటలు సాగు చేస్తే నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. కాలువ ఎక్కడ చూసినా ధ్వంసం కావడంతో నీరు మెట్ట భూముల్లోనే ఆగిపోతోంది. పదేళ్ల కిందట పంట సాగు చేశాం. అప్పుడు పై రైతులతో గొడవ పడి నీరు తీసుకొచ్చాం. ఇప్పుడు గొడవలు పడే ఓపిక లేదు. అందుకే అప్పటి నుంచి పంట సాగు చేయలేదు. గండ్లు లేకుండా కాలువకు మరమ్మతులు చేయాలి. అప్పడే పంట సాగు చేస్తాం.
- నాగేంద్ర, గోవిందరాయునిపేట రైతు
ఎమ్మెల్యే చొరవ చూపాలి..
చెరువు కింద నాలుగు తూముల కాలువలు వెంటనే మరమ్మతులు చేయాలి. అపుడే అన్ని కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు చేరుతుంది. లేకపోతే కాలువ మొదటి భూములల్లోనే వృథాగా పోతుంది. ఎమ్మెల్యే బండారు శ్రావణి చొరవ చూపి మరమ్మతులకు నిధులు తీసుకు రావాలి.
- శ్రీరాములు, రైతు, పోతురాజుకాల్వ
ఎన్నిసార్లు తెలిపినా ప్రయోజనం లేదు
చెరువు కింద కాలువలను మరమ్మతు చేయకపోతే చివరి ఆయకట్టు భూములకు నీరు చేరడం కష్టమని గత పదేళ్ల నుంచి అధికారులకు ఎన్ని సార్లు తెలిపిన ప్రయోజనం లేదు. పాలకులు దృష్టి సారించి కాలువ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
- డి.చిన్నప్పయాదవ్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రతిపాదనలు పంపాం: సాయినాథ్, ఇరిగేషన్ జేఈ
శింగనమల చెరువు నాలుగు తూముల కింద ఉన్న కాలువల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.
Updated Date - Oct 30 , 2024 | 09:34 AM