SINGANAMALA : యూటర్న్ వద్ద ...బ్రిడ్జి కావాలి
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:07 AM
అనం తపురం నంచి తాడిపత్రి వరకు నేషనల్ హైవే సిక్స్ లైన రోడ్డు పనులు జరగుతున్నాయి. అయితే ఈ ప నుల్లో శింగనమలకు వెళ్లేందుకు అధికా రులు సరైన మార్గం చూపకపోవడంతో గ్రామస్థులు, ప్రయాణికు లు గందరగొళంలో ఉన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా అధికారులు స్పందించకపో వడంతో... శింగనమల ప్రజలు, శింగనమలకు రాకపోక లు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శింగనమల వాసులు, ప్రయాణికుల డిమాండ్
శింగనమల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : అనం తపురం నంచి తాడిపత్రి వరకు నేషనల్ హైవే సిక్స్ లైన రోడ్డు పనులు జరగుతున్నాయి. అయితే ఈ ప నుల్లో శింగనమలకు వెళ్లేందుకు అధికా రులు సరైన మార్గం చూపకపోవడంతో గ్రామస్థులు, ప్రయాణికు లు గందరగొళంలో ఉన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా అధికారులు స్పందించకపో వడంతో... శింగనమల ప్రజలు, శింగనమలకు రాకపోక లు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శింగనమలకు వెళ్లాలంటే కిలోమీటరు దూరంలో తాడిపత్రి వైపు శివపురం పెద్దమ్మ గుడి వద్ద యూటర్న్ తీ సుకుని వెళ్లాలని హైవే మ్యాప్‌లో ఉంది. అయితే అంతదూరం వెళ్లి తిరిగి రావడం ఎలా సాధ్యమని, అలాకాకుండా శింగనమల మర వకొమ్మ బ్రిడ్జి నిర్మిస్తే శింగనమలకు వెళ్లడానికి మార్గం సులభ మవుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే పలు మార్లు అధికారుల దృ ష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, కనీసం ప్రజా ప్రతినిధులైనా రోడ్డు సమ స్యపై సృందించి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని శింగనమల గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
పెద్దమ్మ గుడి వద్ద యూటర్న్
హైవే పనుల్లో భాగంగా శింగనమల మరవకొమ్మ వద్ద కొండ ప్రాంతాన్ని చీల్చి రోడ్డు వేస్తున్నారు. కిలోమీటర్ దూరంలో శివపురం పెద్దమ్మ గుడి వద్ద శింగనమలకు వెళ్లడానికి యూటర్న్ వేస్తున్నారు. దీంతో శింగనమల మీద వచ్చే వారు అనంతపురం వెళ్లాలన్నా, అనంతపురం వైపు నుంచి శింగనమల వెళ్లాలన్నా కిలో మీటర్ పైగా ప్రయాణించాలి. అదే మరవకొమ్మ వద్ద బ్రిడ్జి చేపడితే దాని కింద నుంచి సర్వీస్ రోడ్డు ద్యారా శింగనమలకు రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుదని గ్రామస్థులు చె బుతున్నారు. అంతేగాకుండా యూటర్న్ వద్దకు వె ళ్లాలంటే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడు తారని వాపోతున్నారు. దీనిపై అధికారులు ప్రజాపతి నిధులు చోరవ చూపాలని శింగనమల గ్రామస్థులు, ప్రయాణికులు కోరారు. ఈ మేరకు గ్రామస్థులు శింగనమల రహదారి పోరాట కమిటి పేరుతో అధికా రులకు ఎన్నోమార్లు వినతి పత్రాలు అందజేశారు. అ యితే అధికారుల నుంచి ఎలాంటి సృందన రాకపో వడంతో ఈనెల 15న పెద్ద ఎత్తున యువత, గ్రామస్థులు తరలివచ్చి అనంతపురం-తాడిపత్రి హైవే మీద వర్షంలోనే గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ రెండు రోజుల క్రితం సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 24 , 2024 | 12:07 AM