AP ELECTONS : ఇక సమర భేరి..!
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:36 AM
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ పక్రియ సోమవారం ముగిసి.. అభ్యర్థుల తుది జాబితా తేలింది. ఎంపీ అభ్యర్థులలో ఏ ఒక్కరూ తమ నామినేషనన్లు ఉపసంహరించుకోలేదు. మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 136 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 23 మంది...
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
ఎంపీ అభ్యర్థులు 21 మంది
ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 113 మంది
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
అనంతపురం టౌన, ఏప్రిల్ 29: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ పక్రియ సోమవారం ముగిసి.. అభ్యర్థుల తుది జాబితా తేలింది. ఎంపీ అభ్యర్థులలో ఏ ఒక్కరూ తమ నామినేషనన్లు ఉపసంహరించుకోలేదు. మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 136 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 23 మంది ఉపసంహరించుకున్నారు. రాయదుర్గంలో ఒకరు, గుంతకల్లులో ముగ్గురు, తాడిపత్రిలో ఎనిమిది మంది, శింగనమలలో ఇద్దరు, అనంతపురం అర్బనలో ఆరుగురు, కల్యాణదుర్గంలో ఒకరు, రాప్తాడులో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో
ఒక్కరు కూడా నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. బరిలో ఉన్న వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.
ఇక మోత..
అభ్యర్థుల తుది జాబితా ఖరారు కావడంతో పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు ప్రచారంపై పూర్తిస్థాయి దృష్టి సారించనున్నారు. బరిలో ఎంతమంది ఉన్నా.. టీడీపీ కూటమి, వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఎన్డీఏ, స్వతంత్ర అభ్యర్థులు చీల్చే ఓట్ల ప్రభావం ఎవరిపై ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచార వేగాన్ని పెంచేందుకు సిద్ధమయ్యారు. ఎత్తులు.. పై ఎత్తులు.. వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 30 , 2024 | 12:36 AM