Banks crowded : పింఛనదారులతో బ్యాంకులు కిటకిట
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:26 AM
వృద్ధులకు ప్రతినెలా ఇళ్ల వద్దకు వెళ్లి అందించే పింఛన సొమ్మును గత మూడునెలలనుంచి ఎన్నికల సందర్భంగా బ్యాంకుఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నెల కూడా ఖాతాల్లోనే జమ చేశారు.
-పింఛన సొమ్ము డ్రా చేసుకునేందుకు భారీగా రాక
-గంటలకొద్దీ వృద్ధుల పడిగాపులు
గాండ్లపెంట, జూన 3: వృద్ధులకు ప్రతినెలా ఇళ్ల వద్దకు వెళ్లి అందించే పింఛన సొమ్మును గత మూడునెలలనుంచి ఎన్నికల సందర్భంగా బ్యాంకుఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నెల కూడా ఖాతాల్లోనే జమ చేశారు.
దీంతో వాటిని డ్రా చేసుకోవడానికి సోమవారం పింఛనదారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. మండలవ్యాప్తంగా వివిధ రకాల పింఛనదారులు 4,324మంది ఉన్నారు. ఇందులో దివ్యాంగులకు, పండు వృద్ధులకు ఇళ్లవద్దకే వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన సొమ్మును అందజేయాలని ఉన్నతాఽధికారుల ఆదేశాలు ఇవ్వడంతో.. 1,440మందికి ఇళ్ల వద్దనే పంపిణీ చేశారు. మిగిలిన వారికి ఖాతాల్లో జమ చేశారు. 1వ తేదీన పింఛన సొమ్ము జమఅయింది. 2వతేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. దీంతో సోమవారం వాటిని డ్రా చేసుకునేందుకు పింఛనదారులు మండలకేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్దకు భారీగా వచ్చారు. ఓ పక్క రుణాల రెన్యూవల్ కోసం రైతులు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో బ్యాంకు కిటకిటలాడింది. వృద్ధులు పింఛనకోసం చాలాసేపు పడిగాపులు కాశారు. మరికొంతమంది వేలిముద్రలు పడక ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు గంటల కొద్దీ నిలబడలేక అసహనం వ్యక్తం చేశారు.
నల్లమాడ: మండలకేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పింఛనదారులతో కిటకిటలాడింది. కొంతమంది పింఛన డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తే.. మరికొందరు డబ్బులు పడ్డాయా లేదా అని చూసుకోవడానికి వచ్చారు. వృద్ధులతో పాటు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం 3గంటల వరకు బ్యాంక్ కిటకిటలాడింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...