Share News

SCHOOL : మూలనపడ్డ విద్యార్థినుల సైకిళ్లు

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:23 AM

పట్టణంలోని ప్రభుత్వంబాలికోన్నతపాఠశాలలో ఐదు సంవత్సరాలుగా స్టోర్‌ గదిలో మూలప డే శారు. ఆ 15 సైకిళ్లను ఇప్పుడైనా విద్యార్థి నులకు పంపిణీ చేసి సద్వినియోగం అ య్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బాలికల్లో విద్యను ప్రోత్సహిస్తూ, వారిలో అక్షరాస్యతను పెంపొందించడానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉచితంగా వారికి సైకిళ్లు పంపిణీ చేసింది.

SCHOOL : మూలనపడ్డ విద్యార్థినుల సైకిళ్లు
Bicycles lying in the store room of Gorantla School

మూలనపడ్డ విద్యార్థినుల సైకిళ్లు

ఐదేళ్లుగా పంపిణీకి నోచుకోని వైనం

గోరంట్ల, జూన 20: పట్టణంలోని ప్రభుత్వంబాలికోన్నతపాఠశాలలో ఐదు సంవత్సరాలుగా స్టోర్‌ గదిలో మూలప డే శారు. ఆ 15 సైకిళ్లను ఇప్పుడైనా విద్యార్థి నులకు పంపిణీ చేసి సద్వినియోగం అ య్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బాలికల్లో విద్యను ప్రోత్సహిస్తూ, వారిలో అక్షరాస్యతను పెంపొందించడానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉచితంగా వారికి సైకిళ్లు పంపిణీ చేసింది. మండలంలోని విద్యార్థి నుల కోసం సైకిళ్లు పంపిణీకాగా...


బాలికో న్నత పాఠశాల భవ నాన్ని స్టాక్‌ పాయిం ట్‌గా వినియోగించుకున్నారు. అప్పట్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 2019లో విద్యార్థునుల కోసం సైకిళ్లు సరఫరా చేశారు. అయితే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో వాటి పంపిణీ నిలిచిపోయింది. అనంతరం అధికా రంలోకి వచ్చిన వైసీపీ వాటిపై చంద్రబా బు ఫొటో ఉందని పంపిణీ చేయలేదు. త రువాత మనసు మార్చుకుని చంద్రబాబు ఫొటో స్టిక్కర్లు తొలగించి మండలంలోని పాఠశాలలకు సరఫరా చేసి, బాలికలకు అందించారు. ఇంకా మిగిలిన సైకిళ్లను పా ఠశాలలోనే వదిలేశారని బాలికోన్నత పాఠ శాల ఇనచార్జ్‌ ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత తెలిపారు. ఆ తరువాత విద్యా శాఖాధికారుల అనుమతితో కొండాపురం ప్రాథమికోన్నత పాఠశాలకు కొన్నిసైకిళ్లను తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇక అప్పటినుంచి 15 సైకిళ్లు స్టోర్‌ గదిలో అలా గే ఉంచాల్సి వచ్చిందన్నారు. సంబంధి తాధి కారులు చిన్నపాటి మరమ్మ తులు జరిపి వాటిని అవసరమున్న విద్యార్థి నులకు పం పిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 21 , 2024 | 12:27 AM