ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DHARNA : భూనిర్వాసితుల ఆందోళన

ABN, Publish Date - Aug 20 , 2024 | 12:15 AM

గోరంట్ల మండల సమీపంలోని నాసెన, బెల్‌ కంపెనీల కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాలలోని వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం భూనిర్వాసితులతో కలిసి స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాల యం వద్ద నిరసన తెలిపారు. అనంతరం సమస్యలపై సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతి అందించారు.

Farmers protesting at the Sub Collector's office

పెనుకొండ టౌన, ఆగస్టు 19 : గోరంట్ల మండల సమీపంలోని నాసెన, బెల్‌ కంపెనీల కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాలలోని వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం భూనిర్వాసితులతో కలిసి స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాల యం వద్ద నిరసన తెలిపారు. అనంతరం సమస్యలపై సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గోరంట్ల, పాలసముద్రం, సోమందేపల్లి, చిన్నబాబయ్యపల్లి, కావేటి నాగేపల్లి గ్రామాలకు చెందిన రైతుల నుంచి 2013లో భూసేకరణ చేపట్టారని, వారందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ స్పందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 25న 72గంటల పాటు భూనిర్వాసితులతో కలిసి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద వంటా వార్పు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో భూములు కోల్పోయిన బాధితులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 20 , 2024 | 12:15 AM

Advertising
Advertising
<