Share News

VOTE : ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

ABN , Publish Date - May 06 , 2024 | 12:19 AM

రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేసేందుకు గ్రామ సచివాలయ పరిధిలోని అధికారులు ఓటరుస్లిప్పులు పంపిణీచేశారు. రొద్దం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం పంపిణీ చేశారు. రొద్దం మండల వ్యాప్తంగా 48 పోలింగ్‌ బూతలుండగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేసేందుకు అనువుగా ఈసీ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేసినట్లు అధికారులు తెలిపారు.

VOTE : ఓటర్‌ స్లిప్పుల పంపిణీ
Secretariat employees handing out voter slips in Kogira

రొద్దం, మే 5 : రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేసేందుకు గ్రామ సచివాలయ పరిధిలోని అధికారులు ఓటరుస్లిప్పులు పంపిణీచేశారు. రొద్దం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం పంపిణీ చేశారు. రొద్దం మండల వ్యాప్తంగా 48 పోలింగ్‌ బూతలుండగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేసేందుకు అనువుగా ఈసీ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేసినట్లు అధికారులు తెలిపారు.


బీఎల్‌ఓల ద్వారా స్లిప్పుల పంపిణీ

తహసీల్దార్‌ వెకంటేశ్వర్లు

అగళి, మే 5 : రాష్ట్రంలో ఈనెల 13న జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో బీఎల్‌ఓలు, వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు, మండల వ్యాప్తంగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మండల వ్యాప్తంగా దాదాపు 36వేల ఓటర్లు ఉన్నారని 29మంది బీఎల్‌ఓలు, వీఆర్‌ఓల చేత ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో ఓటర్లు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం ముగియనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 06 , 2024 | 12:19 AM