కంకర పోస్తే..
ABN , Publish Date - Apr 29 , 2024 | 11:55 PM
తారు రోడ్డు వేస్తామని అప్పటి వరకు ఉన్న మట్టి రోడ్డును తవ్వేశారు. రోడ్డుపై కంకర వేశారు. తరువాత సిమెంట్ కానీ, తారు కానీ వేయడం మ రచిపోయారు. దీంతో అది కంకర రోడ్డుగా మారిపోయిం ది. ఇదీ మండలంలోని కల్లూరు గ్రామం కొండకింద మారుతీనగర్‌లో రోడ్డు దుస్థితి. కాలనీ నుంచి సింగరప్ప కొండ దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పనులను సుమారు రూ.90 లక్ష ల ఉపాధి నిధులతో ఆరునెలల కిందట ప్రారంభించారు.
తారు ఎవరేస్తారు?గార్లదిన్నె, ఏప్రిల్ 29: తారు రోడ్డు వేస్తామని అప్పటి వరకు ఉన్న మట్టి రోడ్డును తవ్వేశారు. రోడ్డుపై కంకర వేశారు. తరువాత సిమెంట్ కానీ, తారు కానీ వేయడం మ రచిపోయారు. దీంతో అది కంకర రోడ్డుగా మారిపోయిం ది. ఇదీ మండలంలోని కల్లూరు గ్రామం కొండకింద మారుతీనగర్‌లో రోడ్డు దుస్థితి. కాలనీ నుంచి సింగరప్ప కొండ దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పనులను సుమారు రూ.90 లక్ష ల ఉపాధి నిధులతో ఆరునెలల కిందట ప్రారంభించారు. సుమారు 1.4 కిలోమీటర్ల రోడ్డు పనులు చేయాల్సి ఉంది. మారుతీనగర్ సమీపం నుంచి సింగరప్ప దేవాలయం వరకు తారురోడ్డు వేసి దాదాపు 400 మీటర్ల రోడ్డు వేయకుండా కంకర తోలి వదిలిపెట్టారు. దీంతో ఆ రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు సాగించే కాలనీ ప్రజలు, సత్యసాయి వాటర్ సప్లై కార్మికు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కంకర రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రతి రోజూ ఎవరో ఒకరు ప్రమాదాలకు గురిఅవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అయితే రోడ్డు పూర్తి చేయకున్నా పూర్తి చేసినట్లు బోర్డులు ఏర్పాటు చేసి పాలకులు డప్పులు కొడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు ఎక్కడ పూర్తి చేశారో చూపించాలని నిలదీస్తున్నారు.