Share News

SCHOOL : పాఠశాలను పునఃప్రారంభించండి

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:31 AM

మండలంలోని కొప్పునపల్లి తండా గ్రామంలో మూడేళ్ల కిందట మూసి వేసిన ప్రాథ మిక పాఠశాలను పునఃప్రారంభించాలని ఆల్‌ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు ఎంఈఓ గోపాల్‌కు గురువారం వినతిపత్రాన్ని అందించారు. బంజారా నాయకులు రవీంద్రనాయక్‌, వసంతనాయక్‌, రమేష్‌ నాయక్‌, పరమేశ్వర్‌నాయక్‌ గోరంట్లలోని ఎంఈఓ కార్యా లయానికి వెళ్లి అధికారులతో చర్చించారు.

SCHOOL : పాఠశాలను పునఃప్రారంభించండి
A scene where the MEO is giving a petition to Gopal

ఎంఈఓకు బంజారా నాయకుల వినతి

గోరంట్ల, జూన 20: మండలంలోని కొప్పునపల్లి తండా గ్రామంలో మూడేళ్ల కిందట మూసి వేసిన ప్రాథ మిక పాఠశాలను పునఃప్రారంభించాలని ఆల్‌ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు ఎంఈఓ గోపాల్‌కు గురువారం వినతిపత్రాన్ని అందించారు. బంజారా నాయకులు రవీంద్రనాయక్‌, వసంతనాయక్‌, రమేష్‌ నాయక్‌, పరమేశ్వర్‌నాయక్‌ గోరంట్లలోని ఎంఈఓ కార్యా లయానికి వెళ్లి అధికారులతో చర్చించారు. కొప్పనపల్లి తండాలో 80కుటుంబాలు ఉన్నాయని, పాఠశాల నిర్వా హణకు అనువైన నూతన భవనం ఉందన్నారు. బడి ఈడు పిల్లలు 20మంది తండాలో ఉన్నట్లు చెప్పారు. పాఠశాలను మూడేళ్ల కిందట మూసివేశారన్నారు. వారు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఇతరగ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని, గ్రామంలో పాఠశాలను పునః ప్రారంభించాలని కోరారు. విద్యార్థుల ఆధార్‌కార్డులతో సమాచారం ఇస్తే, పాఠశాల పునఃప్రారంభానికి కృషి చేస్తామని ఎంఈఓ తెలిపినట్లు వారు చెప్పారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 21 , 2024 | 12:31 AM