VOTE : తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కు
ABN, Publish Date - May 06 , 2024 | 12:28 AM
తొలిసారి వృద్ధులు ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ఎన్నికల సంఘం తొలిసారి రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. దీంతో ఆదివారం హిందూపురంలో 71 మంది వృద్ధులు ఓటుహక్కు వినియగించుకు న్నారు. పురంలో 73 మంది ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా 71 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హిందూపురం అర్బన, మే 5: తొలిసారి వృద్ధులు ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ఎన్నికల సంఘం తొలిసారి రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. దీంతో ఆదివారం హిందూపురంలో 71 మంది వృద్ధులు ఓటుహక్కు వినియగించుకు న్నారు. పురంలో 73 మంది ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా 71 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంక ఇద్దరు శనివారం మృతి చెందినట్లు ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రెడ్డిశేఖర్ తెలిపారు. కాగా పద్ధతి ప్రకారం ఇంటి వద్దకు ఒక పోలింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఆ ప్రాంతం బీఎల్‌ఓ, ఒక పోలీసు, వీడియో గ్రాఫర్ ఉంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కం పార్టుమెంట్‌లో ఓటు వేసి దానిని షీల్డ్డు కవర్‌లో ఉంచి బ్యాలెట్ బాక్సులో వేయించారు. దానిని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అభిషేక్ కుమార్‌కు అందిం చారు. రాజకీయ నాయకుల సమక్షంలో వాటిని బాక్సుల్లో భద్రపరిచారు.
మడకశిరలో 306 మంది దరఖాస్తు
మడకశిర రూరల్: నియోజకవర్గంలోని 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ దారా హోం ఓటింగ్ కోసం 306 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌరిశంకర్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అందులో 85 ఏళ్లు పైబడిన వృద్దులు 112 మంది, దివ్యాంగులు 194 మంది ఉన్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా సోమవారం వారు హోం ఓటింగ్ వినియోగించునే ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌ఓ తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 06 , 2024 | 12:28 AM