అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 01:17 AM
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు వ చ్చే వినియోగదారులతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ ని జిల్లా రిజిసా్ట్రర్ భార్గవ్ హెచ్చరించారు.
యాడికి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు వ చ్చే వినియోగదారులతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ ని జిల్లా రిజిసా్ట్రర్ భార్గవ్ హెచ్చరించారు.
యాడికి సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయా న్ని శుక్రవారం ఆయన తనిఖీచేశారు. ఈ సందర్భంగా అక్కడి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. వివిధ సేవల నిమిత్తం సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులుకు , సిబ్బందికి హెచ్చరించారు. ఈనెలలో జరిగిన రిజిస్ట్రేషనలపై ఆరాతీశారు. తర్వాత రిజిస్టర్ అయిన పలు డ్యాక్యుమెంట్లను తీసుకొని ఫీల్డ్ విజిట్ చేశారు. ఆయన వెంట యాడికి సబ్ రిజిసా్ట్రర్ జాఫర్ సాధిక్ ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 23 , 2024 | 01:17 AM