arrested పదిమంది పేకాటరాయుళ్ల అరెస్టు
ABN, Publish Date - Sep 23 , 2024 | 12:47 AM
మండలంలోని శివరాం పేట గ్రామ సమీపంలో శనివారం పేకాట స్థావరంపై సీఐ శివరాముడు, సిబ్బంది దాడులు చేశారు.
- రూ. 10,52,550 నగదు స్వాధీనం
కూడేరు, సెప్టెంబరు 22: మండలంలోని శివరాం పేట గ్రామ సమీపంలో శనివారం పేకాట స్థావరంపై సీఐ శివరాముడు, సిబ్బంది దాడులు చేశారు.
అక్కడ పేకాటాడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.10,52,550 నగదుతోపాటు 3 ద్విచక్రవాహనాలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మండలంలో పేకాటరాయుళ్ల నుంచి ఇంత పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Sep 23 , 2024 | 12:47 AM