MLA DAGGUPATI : కలెక్టర్ ముందుచూపుతో నష్టం తగ్గింది
ABN , Publish Date - Oct 24 , 2024 | 12:17 AM
కలెక్టర్ వినోద్ కుమార్ ముందుచూపు వలనే వరద నష్టం బాగా తగ్గిందని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు బుధవా రం రాత్రి అనంతపురం రూరల్ పంచాయతీ గ్రామ సచివాలయం-2లో నిత్యవసరాల పంపిణీ చేపట్టారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరై ఐదు రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ వినోద్ కుమార్ ముందుచూపు వలనే వరద నష్టం బాగా తగ్గిందని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు బుధవా రం రాత్రి అనంతపురం రూరల్ పంచాయతీ గ్రామ సచివాలయం-2లో నిత్యవసరాల పంపిణీ చేపట్టారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరై ఐదు రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎగువు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుందని కలెక్టర్ ముందే గుర్తించి అర్థరాత్రి ఒంటిగంట సమయంలోనే అందర్నీ అప్రమత్తం చేశారన్నారు. దీంతో పంచాయతీ పరిధిలోని ఐదు కాలనీల్లో కొంతమేరకే నష్టం జరిగిందన్నారు. విజయవాడ వరద బాధితులు ఆదుకున్న తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని బాధితులను ఆదుకుంటారని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, ఎంపీడీఓ దివాకర్, ఎంపీటీసీ ఆశాజ్యోతి, కార్యదర్శి శ్రీధర్‌రావు, టీడీపీ నాయకులు నాని, వార్డు సభ్యులు సాలమ్మ, గంగాధర్, షేక్షావలి, మేరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....