10TH RESULTS : ఫలితం మెరుగు.. ర్యాంకు తరుగు!
ABN, Publish Date - Apr 23 , 2024 | 12:51 AM
పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగినా.. ఈ సారి రాష్ట్రంలో జిల్లా స్థానం దిగజారింది. 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 30,893 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. వీరిలో 25,003 మంది పాసయ్యారు. 80.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 24వ స్థానం దక్కింది. పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ సోమవారం విజయ వాడలో విడుదల చేశారు. మార్చి 18 నుంచి 31వ తేదీ వరకూ పది పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైనవారిలో ఏకంగా 18,432 మంది ఫస్ట్‌క్లాస్ సాధించారు.
పదో తరగతి పరీక్షల్లో 80.93 శాతం ఉత్తీర్ణత
రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 24వ స్థానం
గత ఏడాది 66.25 శాతం
ఉత్తీర్ణతతో 20వ స్థానం
పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగినా.. ఈ సారి రాష్ట్రంలో జిల్లా స్థానం దిగజారింది. 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 30,893 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. వీరిలో 25,003 మంది పాసయ్యారు. 80.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 24వ స్థానం దక్కింది. పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ సోమవారం విజయ వాడలో విడుదల చేశారు. మార్చి 18 నుంచి 31వ తేదీ వరకూ పది పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైనవారిలో ఏకంగా 18,432 మంది ఫస్ట్‌క్లాస్ సాధించారు. సెకెండ్ క్లాస్ 4,100 మంది, థర్డ్ క్లాస్‌లో 2,471 మంది సాధించారు. 5,890 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
19.07 శాతం ఫెయిల్యూర్ నమోదైంది. 2022-23 విద్యా సంవత్సరంలో 66.25 శాతం మంది పాస్ కాగా, జిల్లాకు 20వ స్థానం దక్కింది. కానీ ఈసారి 80.93 శాతం మంది పాసైనా.. 24వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
- అనంతపురం విద్య
పరీక్షలు రాసినవారు : 30,893 మంది
పాసైనవారు : 25,003 మంది
ఫస్ట్ క్లాస్ : 18,432 మంది
సెకెండ్ క్లాస్ : 4,100 మంది
థర్డ్ క్లాస్ : 2,471 మంది
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు వచ్చే నెల 24 నుంచి జూన 6వ తేదీ వరకూ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 5,890 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరు ఈ నెల 23వ తేదీ నుంచే.. అంటే మంగళవారం నుంచే పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చును. రూ.50 అపరాధ రుసుముతో మే 1వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
బాలికలదే పైచేయి
జిల్లా వ్యాప్తంగా 15,017 మంది బాలికలు పరీక్షలు రాయగా 12,766 మంది పాసయ్యారు. బాలురు 15,876 మంది పరీక్షలు రాయగా 12,237 మంది పాసయ్యారు. బాలికలు 85.01 శాతం, బాలురు 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 29,666 మంది పరీక్షలకు హాజరు కాగా 19,654 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలికలు 10,060 మంది, బాలురు 9,594 మంది ఉన్నారు. గత ఏడాది బాలికలు 70.06 శాతం, బాలురు 62.68 శాతం పాసయ్యారు.
నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలు
పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరేందుకు ఇబ్బంది లేకుండా నాలుగు రోజుల్లోనే మార్కుల జాబితాలు అందుబాటులో ఉంచుతామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఫలితాలు వచ్చిన 4రోజుల తర్వాత ఠీఠీఠీ.ఛట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో మార్కుల జాబితాలు అందుబాటులో ఉంచనుంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
స్కూల్ లాగిన నుంచి మార్కుల జాబితాలు, వ్యక్తిగత షార్ట్ మెమోలను డౌనలోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లకుండా ఠీఠీఠీ. ట్ఛటఠజ్టూట.ఛట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ నుంచి కూడా షార్ట్ మెమోలను డౌనలోడ్ చేసుకోవచ్చు.
నేటి నుంచి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన..
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన కోసం విద్యార్థులు ఆనలైనలో మంగళవారం నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 30వ తేదీ రాత్రి 11 గంటల వరకూ దీనికి అవకాశం ఇచ్చారు. విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన కోసం తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు పొంది, అక్కడే ఫీజులు చెల్లించాలి. రీ కౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Apr 23 , 2024 | 12:51 AM