MLA DAGGUPATI : గుంతల రోడ్డు, చెత్త కనిపించకూడదు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:35 PM
ఇకపై నగరంలో గుంతల రోడ్లు, చెత్తా, చెదారం కనిపించకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. ఆయన శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నగరపాలిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అం శాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
నగరపాలిక అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
అనంతపురం క్రైం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి) : ఇకపై నగరంలో గుంతల రోడ్లు, చెత్తా, చెదారం కనిపించకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. ఆయన శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నగరపాలిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అం శాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. నగరంలో త్వరలో బీసీ భవన, కాపు భవన నిర్మించబోతున్నామని, ఇందుకోసం స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రధాన వంకల పరిధిలో అక్రమంగా ఇళ్లు నిర్మిం చుకున్న వారికి నోటీసులు ఇవ్వాలన్నారు. ఆక్రమణలు తొలగాల్సిన అవసర ముందన్నారు. ఓపెన సైట్లకు ఫెన్సింగ్ వేసి రక్షించాలన్నారు. నగరంలో ఆవులు, ఇతర పశువులు తిరుగకుండా వాటి యజమానులను హెచ్చరించా లని, లేకపోతే గోశాలకు తరలించాలన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో కమిషనర్ నాగరాజు, టౌనప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....